
జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 29, బాలాజీ నగర్, పీఏ పల్లి మండలం;
స్వస్తిశ్రీ చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ 30.4.2025 బుధవారం రోజున ఉదయం 7 గంటల 24 నిమిషాలకు రోహిణి నక్షత్ర యుక్త మేష లగ్న పుష్కరాంశమున నల్గొండ జిల్లా పీఏపల్లి మండలంలోని బాలాజీ నగర్ గ్రామంలో వెలసియున్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం శంకుస్థాపన మహోత్సవం జరుగును. కావున భక్త మహాశయులు, గ్రామవాసులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయగలరని దేవాలయ కమిటీ కోరడమైనది.