
ఇబ్బంది పడుతున్న ద్విచక్ర వాహనదారులు
జనసముద్రం న్యూస్,కాన్వెంట్ జంక్షన్, జ్ఞానపురం,విశాఖపట్నం, ఏప్రిల్29
కాన్వెంట్ జంక్షన్ నుంచి పూర్ణ మార్కెట్ కి వెళ్ళే రహదారిలో కాన్వెంట్ జంక్షన్ మున్సిపల్ పంపు హౌస్ పక్కన ఉన్న గెడ్డ పైన ఉన్న రోడ్డు అంచులో రైలింగ్ లేకపోవడం వలన ఈ ప్రాంతం వైపుగా రాకపోకలు సాగించే ద్విచక్ర వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు,,తమ యొక్క ద్విచక్ర వాహనాలను వెనుక వైపుగా వొచ్చే భారీ వాహనాలను తప్పించే ప్రయత్నం లో తాము ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నామనీ చెబుతున్నారు,

,గెడ్డ ప్రక్కన ఉన్న రోడ్డు అంచులో రైలింగ్ లేకపోవడం వలన భారీ వాహనాలను తప్పించుకొనే ప్రయత్నం లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రోడ్డు అంచునుంచి గెడ్డలో తమ యొక్క ద్విచక్ర వాహనం తో సైతం పడిపోయే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు,,ముఖ్యం గా మహిళా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు,, ఈ ప్రాంతానికి కొద్దిగా దూరంలోనే కాన్వెంట్ జంక్షన్ ట్రాఫిక్ పోలీస్ ఔట్ పోస్ట్ ఉందని చెబుతున్నారు,,కనీసం వారైన ప్రమాదం కరంగా వున్న ఈ ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ రైలింగ్ ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అలాగే సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ రోడ్డు అంచున రైలింగ్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు,,