అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ ఏప్రిల్ 28 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ సార్..!! మాపై కరుణ చూపండి… రాజంపేట మండల కేంద్రంలోని కూచివారి పల్లిలో ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలం నుండి పొలాల వద్దకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
వివరాల్లోకి వెళితే:-
రాజంపేట మండలం కుచివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 381/3 381/5 381/8 381/9 381/10 మరియు ఇతరులకు సంబంధించిన సుమారు 20 ఎకరాల పైన భూమి ఉందని,గత 100 సంవత్సరాల నుంచి ప్రధాన రహదారుల నుండి శ్రీనివాసులు నాయుడు పొలం ఆనుకుని రాస్తా ద్వారా వెళ్లి పొలాలకు నీళ్లు పెట్టు కుంటూ వ్యవసాయం చేసేవారమన్నారు. అయితే ఇటీవల కాలంలో ఓ వ్యక్తికి సంబంధించి 46 సెంట్లు ఉంటే దానికి తోడు ప్రభుత్వ భూమి రాస్తా కూడా ఆక్రమించుకొని ఎత్తయిన గోడ నిర్మించి అటువైపు పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా నిర్మించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని తాసిల్దార్, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేశామని తలపనేని శివప్రసాద్ తో పాటు మరి కొంతమంది రైతులు తెలిపారు. అంతేకాకుండా పొలాలకు వెళ్లేందుకు దారి లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరామన్నారు. పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోతే పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు…





