జనసముద్రంన్యూస్, ఏప్రిల్ 29 అమరావతి;
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యమిస్తూ పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. 2025 జూన్ నుంచి రేషన్ షాపుల్లో సరుకులతో పాటు సబ్సిడీ పై కేజీ కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో 3 నెలలకు సరిపడా కందిపప్పు, ఏడాదికి సరిపడా రాగుల సేకరణకు టెండర్లు ఆహ్వానించింది.





