జనసముద్రం న్యూస్ : ఏప్రిల్ 29 (పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ )
పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామానికి చెందిన స.హ.చట్టం కార్యకర్త , సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ తాను గ్రామంలోని అక్రమ కట్టడాల పై సమాచార హక్కు చట్టం 2005 ద్వారా అక్రమ కట్టడాలకు సంబంధించిన అనుమతులు ఇతర పలు అంశాలపై ఆర్టిఐ దరఖాస్తులు చేస్తే రాఘవపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి తూముల రవి స్పందించడం లేదని బొబ్బిలి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కూడా తేదీ: 11 మార్చి 2025 రోజున రాఘవపూర్ గ్రామంలో జరుగుతున్న అక్రమ కట్టడంపై ఆర్టిఐ దరఖాస్తు చేశారు. 41 రోజులు గడిచిన కూడా తాను కోరిన ఆర్టిఐ దరఖాస్తు పై సమాచారం ఇవ్వలేదు. అంతటితో బొబ్బిలి సత్యనారాయణ తేదీ 23 ఏప్రిల్ 2025 రోజున పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొదటి అప్పీలు దరఖాస్తు చేశారు. ఎంపీడీవో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.





