యాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.26)
జనసముద్రం న్యూస్ బీబీనగర్ పట్టణంలోని పి.అర్.జి గార్డెన్స్ లో శివాలయ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కేరళ రాష్ట్రానికి చెందిన కీ”శే శివదాసు గురుస్వామి సంతాప సభలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్.ఈ కార్యక్రమంలో బీబీనగర్ మండలానికి సంబందించిన అయ్యప్ప గురుస్వాములు మరియు అయ్యప్ప భక్తులు పాల్గొని గురు స్వామీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.





