
జన సముద్రం న్యూస్ (హుజురాబాద్ , కరీంనగర్ విలేఖరి మట్టెల సంపత్ ఏప్రిల్ 26):
ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడులకు బలైన అమరులకు ఘనంగా నివాళులు అర్పించిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రహల్లామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది గర్హించదగ్గ విషయమని అన్నారు ప్రభుత్వము ఇటువంటి దాడులు ఇకముందు జరగకుండా సరైనటువంటి భద్రతా చర్యలను తీసుకోవడమే కాకుండా ఈనెల 22న ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేసి నారు కార్యక్రమంలో ఐఎంఏ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు అంకం సుధాకర్, కోశాధికారి తొగరు విద్యాసాగర్, కార్యదర్శి ఉడుగుల సురేష్, వైద్యులు శ్రీకాంత్ రెడ్డి, ఎం రమేష్,కృష్ణమూర్తి, నాగలింగం, బండి శృతి, కవిత తదితరులు పాల్గొన్నారు.