మలక్ పేట వివాహిత మృతి కేసులో ట్విస్ట్.

Spread the love

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె ఊపిరాడకుండా హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. దీంతో శిరీష భర్త వినయ్‌ హత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు వినయ్‌తో పాటు అతని ఇద్దరు అక్కలను ఉస్మానియా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ జిల్లా పరకాలకు చెందిన విజయలక్ష్మి చిన్న కుమార్తె శిరీష (32)కు, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రిన్సి అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం వీరు మలక్‌పేటలోని జమునా టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి శిరీష ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పి, భర్త వినయ్ ఆమెను సమీపంలోని మెట్రో క్యూర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఈ విషయాన్ని శిరీష కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, భౌతికకాయాన్ని స్వగ్రామం దోమలపెంటకు తరలించేందుకు వినయ్‌ ఏర్పాట్లు చేశాడు.

ఈ సమాచారం అందుకున్న శిరీష మేనమామ మధుకర్, వినయ్‌కు కాల్ చేసి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచాలని సూచించారు. కానీ వినయ్‌ ఈ మాటను పట్టించుకోకుండా అంబులెన్స్‌లో శిరీషను స్వగ్రామానికి తరలించేందుకు బయల్దేరాడు. అసహనానికి గురైన మేనమామ మధుకర్, అంబులెన్స్‌ డ్రైవర్‌ను గుర్తించి, అతనికి ఫోన్‌ చేశాడు. పరిస్థితి అనుమానాస్పదంగా మారడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ ఈ విషయాన్ని చాదర్‌ఘాట్‌ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు.

శిరీష కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకుండా హత్యచేసినట్లు తేలడంతో, వినయ్‌తో పాటు అతని ఇద్దరు అక్కలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. శిరీషను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇది వినయ్, అతడి కుటుంబ సభ్యుల పనియేనా? దీన్ని సహజ మరణంగా ఎందుక చిత్రీకరించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని విషయాలు విచారణలో బయటపడనున్నాయి.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి