
జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి మార్చి 4
చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామములో వాహన తనిఖీలు నిర్వహించు చుండగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామము నకు చెందిన ఒక వ్యక్తి బజాజ్ పల్సర్ టూ వీలర్ మోటార్ సైకిల్ వాహనము పై కచ్చా రాటాలు రాజు అను వ్యక్తి వద్ద నుండి (2) లీటర్లు నాటు సారాయి స్వాధీన పరచుకుని , విచారణ చేయగా అతను ఇచ్చిన సమాచారము మేరకు నాగిరెడ్డి గూడెం గ్రామములో వడిత్య బోడి అను మహిళ వద్ద (2) లీటర్లు నాటు సారయిను స్వాధీన పరచుకుని , వారిరువురు పై కేసు నమోదు చేయడమైనది ఈ దాడులలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ ఎస్.ఐ.లు ఆర్.వి.ఎల్.నరసింహా రావు, అబ్దుల్ ఖలీల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు అని ఎక్సైజ్ సి.ఐ. పి.అశోక్ తెలిపినారు!