ఇంధన్ పెళ్లి అటవీ రేంజ్ అధికారి :కారం శ్రీనివాస్
ఖానాపూర్ నియోజకవర్గం డిసెంబర్ 12జనసముద్రం న్యూస్
కవ్వాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కలప గానీ అక్రమంగా విలువ ఉంచిన వాటిని రవాణా చేసిన లేదా మెటీరియల్ గా ఇలాంటి పర్మిషన్ లేకుండా తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లింగంపల్లి రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం రోజున ఖానాపూర్ నియోజకవర్గంలోని
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపెల్లి రేంజులోని కవ్వాలకు చెందిన ముస్తాక్ ఇంటి ఆవరణలో చేనులల్లో ఉన్న అటువంటి రూ.35 వేలు అక్రమ టేకు ఫర్నిచర్ తో పాటు విద్యుత్ మోటారును, కోత రంపాలను అటవీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా అందిన సమాచారం మేరకు ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు కృష్ణారావు, హనుమంతరావు, రవి, ముజిబోద్దీన్, అమృత రావు, బేస్ క్యాంపు సిబ్బంది కవ్వాల కు వెళ్లి ముస్తాక్ ఇంటి ఆవరణలో సోదాలు చేయగా, ఫర్నీచర్, రంపం, విద్యుత్ మోటర్ లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేంజర్ తెలిపారు.