
తనకు నియోజకవర్గం, నవంబర్ 3, (జన సముద్రం న్యూస్):- ఖానాపూర్ పట్టణంలోని ఓమిని లో పిడిఎఫ్ బియ్యం అటవీ అధికారులు తనిఖీలో భాగంగా పట్టుకున్నారు. శనివారం ఖానాపూర్ కేంద్రంలో అటవీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యంను పట్టుకొని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఖానాపూర్ కేంద్రంలో నుంచి ఓమినిలో అక్రమంగా తరలిస్తున్న 12 క్వీంటాళ్ళ బియ్యం పట్టుకున్నామని అటవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.