ఖానాపూర్ నియోజకవర్గం. నవంబర్ 3, (జన సముద్రం న్యూస్):
ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన తోడసం నాగు-ఇస్రుబాయి ల మైనర్ బాలుడు లాల్ సావ్ (10) శుక్రవారం కనబడకుండా పోయాడు. ఆ గ్రామ శివారు బావిలో పడి మృతి చెందిన విషయం శనివారం ఉదయం గ్రామస్తులకు బావిలో మైనర్ బాలుడు శవమై కనిపించాడు. మైనర్ బాలుడు మరణించిన విషయమై వారి తల్లిదండ్రులకు స్థానికులు సమాచారం అందజేశారు. చుట్టుపక్కల బావిలో మైనర్ బాలుడు మరణించిన సంఘటనపై ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.