జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12
గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో కలిసి నేరేళ్ తండా గ్రామ శివారులో గల బామన్ సజ్జు అనే వ్యక్తి ఇంటి దగ్గర రక్కీ చేయగా ఇంటి వద్దకు అదే గ్రామానికి చెందిన బస్సి ప్రకాష్ అనే వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చి రెండు చిన్న నల్లని కవర్లలో గంజాయి తీసుకుని ఉంటుడగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, వారిని పూర్తిగా విచారించి వారి దగ్గర గల 105 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొవటం జరిగింది. గంజాయిని బామన్ సజ్జు తన ఇంటి ముందు గల ఖాళీ ప్రదేశం నందు గంజాయి మొక్కలు పెంచి దాని చుట్టూ ఎవరికి అనుమానం కాకుండా కట్టెలతో కప్పిపెట్టి, అది ఎండిన తర్వాత, అట్టి గంజాయి ని అదే గ్రామానికి చెందిన బస్సి ప్రకాష్ ద్వారా చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయి తాగే వినియోగదారులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని సమాచారం ద్వారా పట్టుకొని వారిద్దరి పైన కేసు నమోదు చేయడమై నాదని గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు