(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి)
హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్ ఎంఈఓ కి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా వినతి పత్రం లో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తమకు అకాడమీ ఇయర్ అయిపోయేంతవరకు పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఆందోళన చేశారు ఈ ఆందోళన భాగంగా ఎంఈఓ గారిని కదలనివ్వకుండా మా పిల్లల భవిష్యత్తు దృశ్య ఆలోచన చేసి పాఠశాల ని కొనసాగించాలని ఆందోళన చేశారు. పిల్లలు కూడా తమదైన శైలిలో ఎంఈఓ గారిని మా పాఠశాల ని తిరిగి కొనసాగించాలని వారు కోరారు పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇప్పుడు మాత్రం పిల్లలు వేరే స్కూలు అంత తొందరగా అలవాటుపడరు అని, ఒకటి నుండి 5వ తరగతి వరకు ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క రకమైన పబ్లిషర్ కు చెందిన పుస్తకాలు వాడతారు అందువల్ల మా పిల్లలు వేరే పాఠశాల కి వెళ్ళిన ఉపయోగం ఉండదు.
మధ్యంతరంగా పాఠశాలను మూసివేయడం వలన మా యొక్క పిల్లల మానసిక ధైర్యం కోల్పోయి, విద్యలో వెనకబడి పోతారని తెలియజేశారు.వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలను కొనసాగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున మీరు కేవలం ఈ ఒక్క అకాడమిక్ ఇయర్ కు అనుమతి ఇచ్చి మా పిల్లల జీవితాల కు ఇబ్బంది కలగకుండా చూడవలసిందిగా తల్లిదండ్రులు గా వారి ఆవేదనను తెలియజేశారు లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఎంఈఓ మాట్లాడుతూ మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని పై అధికారులతో చెప్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు..