జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని బుధవారం ఆయన విడుదల చేశారు. యువత బాగా చదువుకుంటూ క్రమశిక్షణతో జీవిత లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రాజ్ కుమార్, ప్రణయ్,మణీసాగర్, అక్షయ్, అంజు, తదితరులు పాల్గొన్నారు.