పేదరికాన్ని జయించి చదువుల తల్లి గా రాణించి చివరికి గుండె ఆగిన చిట్టితల్లి …!*

Spread the love

  • చిన్నప్పుడే మరణించిన తల్లిదండ్రులు
    • తమ్ముడు తో కలిసి మోడల్ స్కూల్లో విద్యాభ్యాసం
    • జ్వరంతో పది రోజులు పోరాడిన మహేశ్వరి
    • చివరి తుది శ్వాస విడిచిన ఇంటర్ విద్యార్థి

  • మునగాల ప్రతినిధి (జనసమూత్రం న్యూస్): సెప్టెంబర్ 20

పేదరికం జయించి, చదువుల తల్లి గా రాణించి, విష జ్వరంతో 10 రోజుల పాటు పోరాడి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె…కన్నీటి గాధ.. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల బ్రహ్మయ్య, నాగేంద్రమ్మ భార్య భర్తలిద్దరు గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారికి కొడుకు, కూతురు, సాయి భార్గవ్(14), మహేశ్వరి(15), అయితే వీళ్ళిద్దరూ వృద్ధురాలైన నాయనమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అమ్మానాన్న లేకపోయినా అనాధను అన్న భావనలేక, ఆత్మ ధైర్యంతో చదువుల తల్లిగా రాణిస్తూ, పేదరికన్ని జయించింది ఆ చిన్నారి. మునగాల మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మహేశ్వరి కు 10 రోజుల నుండి విష జ్వరంతో బాధపడుతుంది. ఆదుకునే వాళ్లు ఎవరు లేక చివరకు మహేశ్వరి మృతి చెందింది. ఇలా నీ జీవితం మధ్యలోనే అర్ధాంతరంగా అనారోగ్యంతో ముగిస్తుందని ఊహించలేదని, ఎక్కడ కలిసిన ఆప్యాయతతో పిలిచే నువ్వు మా మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని మునగాల గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు..
సహాయం అందించి ఉంటే బ్రతికేది: పచ్చిపాల రామకృష్ణ
మునగాల మండలంలో అధికారులు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నప్పటికీ ఆ చిట్టి తల్లి గాధ తెలిసినప్పటికీ ఎవరు సహాయం అందించడానికి ముందుకు రాకపోవడంతో ఆ చిన్నారి చిట్టితల్లి గుండె ఆగిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా ఆ కుటుంబంలో మిగిలిన సాయి భార్గవ్ ను చదువుల్లోనూ, ఆర్థికంగా, ఆదుకోవాలని మునగాల మండల ప్రజలను వేడుకున్నారు…

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్