జనసముద్రం న్యూస్ : సెప్టెంబర్ 20 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ )
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్ ముందుగా ఉన్న ఇండియన్ ఆయిల్ టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో మూత్రశాల , మరుగుదొడ్ల నిర్వహణ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పెట్రోల్ బంకులో రెండు మూత్రశాల,మరుగుదొడ్లు ఉంటే ఒకటి ప్రయాణికులకు, వాహనదారులకు ఉపయోగంలో ఉంది. మరొకటి సిబ్బంది మాత్రమే ఉపయోగించేలా మూత్రశాల మరుగుదొడ్డికి ప్రత్యేకంగా తాళం వేసి వేరే వాళ్ళు ఉపయోగించకుండా ఉంది. పెట్రోల్ పోయించుకొని వెళ్లే ప్రయాణికులకు సంబంధించి ప్రతి పెట్రోల్ బంకులు కల్పించే ఉచిత సేవలలో మూత్రశాలలు,మరుగు దొడ్ల ఏర్పాటు అనేది ఉంటుంది. కానీ ఈ పెట్రోల్ బంకులో వాహనదారులకు, ప్రయాణికులకు ఉపయోగంలో ఉన్న ఒక్క మూత్రశాల మరుగుదొడ్డి కూడా పెట్రోల్ పంపు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా ఉందని వాహనదారుల, ప్రయాణికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. మూత్రశాల మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడం పై పెట్రోల్ పంపు సిబ్బంది అయిన ప్రేమ్ ను అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఈ ప్రేమ్ పెట్రోల్ బంకులో ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటాడని మూత్రశాల మరుగుదొడ్డి వాసన వస్తుందని నీళ్లు రావడం లేదని అడిగితే మొబైల్ చూస్తూనే ఉంటాడని సమాధానం చెప్పడం లేదని వాహనదారుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్న ఒక మూత్రశాల మరుగుదొడ్డి కాకుండా రెండు మూత్రశాల మరుగుదొడ్లను ఉపయోగించేలా చేయాలని టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంపు నిర్వాహకులను పెట్రోల్ పంపు కు వచ్చే వాహనదారులు కోరుతున్నారు.