జనసముద్రం న్యూస్ సెప్టెంబర్ 15( పామిడి )
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఉన్న ప్రభత్వ ఆసుపత్రికీ ఒక బాలుడు ప్రధమ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి కి రావడంతో నందకిషోర్ 10 సంవత్సరాలు బాలుడు గత 5 సంవత్సరాలనుండి నడుము క్రింది భాగంలో ఫారిన్ బాడీ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడు. దీంతో వైద్యాధికారి శివ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కమలాధర్ మరియు హెడ్ నర్సు శివకుమారి, థియేటర్ అసిస్టెంట్ అంజినప్ప, కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో సిఆర్ఎం ఎక్స్రే మిషన్ సహాయంతో చేయవలసిన ఖరీదైన శస్త్ర చికిత్సను తనదైన శైలిలో ఫారిన్ బాడీని తొలగించినారు. అందుకుగాను రోగి తరపు వారి బంధుమిత్రులు, ఆనందం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు.