చదువులు మాట దేవుడు ఎరుగు…!!గిరిజనులతో విద్యకు బదులు వెట్టిచాకిరి…!!
అనంతరాజుపేట అంబేద్కర్ మినీ గురుకులం..!!
ఇటువంటి తప్పులు, ఇంకెప్పుడూ జరగకుండా చూసుకుంటాము.. అంటున్న ఇంచార్జ్
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 15,జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా
కోడూరు నియోజకవర్గంలోని అనంతరాజుపేట గ్రామపంచాయతీ లో, మినీ గురుకులం కొన్ని నెలలుగా వంట మనుషులు లేకపోవడంతో పాఠశాలలోని విద్యార్థులను…!! వంటపని మనుషులుగా తీర్చిదిద్దుతున్న పాఠశాల ఉపాధ్యాయులు… ఎంతో కష్టపడి కూలి నాలి చేసి గిరిజనులైన ఆడపిల్లలు, కొద్దో గొప్ప అయినా చదివిద్దామనే ఉద్దేశంతో, ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ ప్రతిరోజు కూలికి వెళుతూ తన పిల్లలు ఆ కష్టం పడకూడదని ఎక్కడెక్కడ నుంచో ఎస్టి బాలికలను పాఠశాలలో చేర్పించు… మా పాప చదువుకుంటుంది అని వారి పని వారు చేసుకుంటుంటే,పాఠశాల వార్డెన్ మాత్రం వారిని వంట మనుషులుగా, పని మనుషులుగా తీర్చిదిద్దుతూ ఉన్నా కూడా, పట్టించుకోని అధికారులు, వారం,వారం విసిటింగ్ అని, ఎస్టీ బాలికల అభ్యున్నతికి, వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామని ప్రగల్బాల్ పలుకుతూ చాలామంది అధికారులు పండగలకి, కొన్ని స్పెషల్ డేస్ కి అక్కడే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా వారి అభివృద్ధికి కాదు కదా..!! వారు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఎవరైనా బయటికి చెబితే ప్రాణాలు తీస్తామని, ఎవరైతే బయటికి తెలియజేస్తారో వారిని స్కూల్ నుంచి పంపించి వేస్తామని, మేము చెప్పింది వేదం…?? అని పిల్లలని బానిసలుగా చేసి విద్యా బోధన చేయకుండా,పని భారం ఎక్కువ చూపించి పిల్లలను దేనికి పనికి రాకుండా చేస్తూ వారి భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా జరగడంలేదని, ఇదివరకే ఈ పాఠశాల మీద చాలా అభియోగాలు ఉన్నాయని, అధికారులను డబ్బుతో, మభ్య పెడుతూ వస్తున్నారని,గత శుక్రవారం వీఆర్వో తో కలిసి స్కూల్లో సందర్శించిన విలేకరులకు విస్తుపోయే నిజాలు తెలియడంతో పాటు స్కూలు హెచ్ఎం లేకపోవడంతో ఇన్చార్జి హెచ్ఎం ను వివరణ అడగ్గా… తప్పు జరిగింది.. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూస్తాం.. , ఈ విషయం పేపర్లో రాకుండా చూడాలని బ్రతిమలాడం కొస మెరుపు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల వార్డెన్ నుంచి పిల్లలను కాపాడి,త్వరితగతిన పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయడమే కాకుండా తగిన శిక్ష వేయాలని, ఇటువంటివి ఇంకెప్పుడు తిరిగి మళ్లీ జరగకుండా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు…