జన్నారం విలేఖరి, జన సముద్రం న్యూస్, ఆగస్టు 22
మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా మహిళ ఐద్వా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి నిరసనగా బుధవారం రాత్రి జన్నారం పట్టణంలోని రామ్ నగర్ లో ఆమె స్థానిక మహిళలతో కలిసి క్యాండిల్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలలు యువతులు, విద్యార్థులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ కత్తా సంఘటనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలన్నారు. అలాగే మహిళలపై అఘాయిత్యాలు చేసే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.





