గుంతలు పడిన రోడ్ల కు ఎట్టకేలకు మరమ్మత్తులు.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 18 ఆగష్టు
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట (టౌన్) మున్సిపాలిటీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు గుంతల మయమైన విషయమై జనసముద్రం పత్రికలో కథనం రాయడం జరిగింది.
స్పందించిన జమ్మికుంట పురపాలక కమీషనర్, కౌన్సిలర్లు, ఎట్టకేలకు రోడ్లకు మరమ్మతులు జరిపారు.
జమ్మికుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్.ఓ.బి.) ప్రక్కన గుంతలు పూడ్చబడినవి.
దీంతో రవాణా సౌకర్యం మెరుగు పడింది.
అదే విధంగా జమ్మికుంట నుండి కోరపల్లి రోడ్డు మార్గం (పాత కూరగాయల మార్కెట్) మార్గమున పెద్ద డ్రైనేజీ కాలువ పై సిమెంట్ కాంక్రీటు బిళ్ళ వేసి మరమ్మత్తులు చేశారు.
కదిలిన మున్సిపల్ యంత్రాంగం పై
జమ్మికుంట పట్టణ వాసులు, పుర ప్రముఖులు,ఓటర్లు, వ్యాపారస్తులు, మేధావి వర్గాలు, సామాజిక కార్యకర్తలు ఒక ప్రకటనలో “హర్షం” వెల్లడించారు.