జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు
ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ పై అధికారుల అందరికీ బాధితురాలైన రమాదేవి ఫిర్యాదు చేయడం జరిగింది.
వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన కరీంనగర్ లో తన ఇంటి పై 9 ఆగస్టు రోజు నా దౌర్జన్యం చేస్తూ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ఇంటి ఆవరణ చెట్లను నరికి వేస్తూ మారనయుధాలు చూపెడుతూ బెదిరిస్తూ తిడుతూ కొంత గోడ కూల్చి నానా విధాలుగా దుర్భాషలాడుతూ బయటికి రండి, సంపుతామంటూ, అనేక రకాలుగా బయటికి చెప్పడానికి వీలు లేని విధంగా బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేసినా ఒంటెల సుమ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, కొంతమంది మహిళలు వారి అనుచరులు వారికి సహకరించిన పోలీసులు అందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని తన ఫిర్యాదులో వివిధ శాఖల అధికారులతో పాటు మునిసిపల్ రెవెన్యూ పోలీసు జిల్లా కలెక్టర్లుకు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని పై వెంటనే ఎఫైర్ నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని, వివిధ సంఘాలు సంఘీభావం మద్దతు తెలపడం జరిగింది. 2024 ఆగస్టు 9న తారీఖు రోజే నేను ఫిర్యాదు చేసినప్పటికీ నాకు ఇంత వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అట్టి వారి పై ఎలాంటి చర్యలు గై కొనలేదు. మా ఇంటిపై ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని , అట్టివారితో ఎన్నటికైనా మాకు, మా కుటుంబానికి ప్రాణం భయం ఉన్నదని , రక్షణ కల్పించాలని ఒకవేళ మాకు మా కుటుంబ సభ్యులకు ఏమైనా జరుగుతే దానికి ఒంటెల సత్యనారాయణ రెడ్డి సుమ వారి అనుచరులు పోలీసులు అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని, తమగూడును విన్నవించుకోవడం జరిగింది. మాకు తగు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వ అధికారులను వేడు కుంటున్నాను అని తెలిపినది.