జన్నారం మండల రిపోర్టర్ జన సముద్రం న్యూస్ జులై 28:
మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని రామ్ నగర్ మేదర్ వాడలో నిర్మించిన సిసి రోడ్డుపై మట్టి ఉండడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు.కాలనీలా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మేదరి వాడలో కొత్తగా సిసి రోడ్డును నిర్మించింది.ఆ రోడ్డు పూర్తయిన తర్వాత నీటి క్యూరింగ్ కోసం మొరం మట్టిని వేశారు.ఆ మట్టిని పూర్తిగా తొలగించకపోవడంతో వర్షాలకు బురదగా మారి వాహనాలు అదుపుతప్పుతున్నాయని, ఆ మొరం మట్టిని తొలగించాలని కాలనీవాసులు కోరారు





