ఈ వాడ.. నీదిఆ వాడ.. నాది.

Spread the love

ఆ “దొర” (పటేల్) మరణిస్తే ఈ రోజు “చావు బొంద” తవ్వడం నా వంతు.

జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 28 జూలై

భారతదేశంలో ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా గ్రామాలలో కొనసాగుతూనే ఉన్నాయని అటువంటి సాంప్రదాయాలకు స్వస్తి పలికి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు,డిజిటల్ రంగాల వైపు,దృష్టి కేంద్రీకరించాలని బహుజన మేధావులు, సామాజిక విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.


భారతదేశానికి పల్లెటూళ్ళే పట్టుకొమ్మలు అనేది జగమెరిగిన సత్యం.
ఆది మానవుడి నుండి ఆధునిక సాంకేతిక యుగం వరకు గ్రామాలలో ఇంకను వంతుల వారీగా పెత్తనాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అట్టి సాంప్రదాయలకు స్వస్తి పలికి చదువు,సంస్కారం,విలువలు పెంపొందించుకునే దిశగా యువత పయనించాలి.
గ్రామాలలో ఒక దొర, దొర కుటుంబంలోని వ్యక్తి, పటేల్ చనిపోయినట్లయితే ఈరోజు “చావుబొంద” తవ్వడం నా వంతు అంటూ.. గంతులు వేస్తూ ముందుకు దూసుకు వెళుతున్నారు.
పెద్దమనిషి ముసుగులో తమ పిల్లల చదువులపై దృష్టి కేంద్రీకరించకుండా.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దలేక విఫలమవుతున్నారు.
నేటి యువత కనువిప్పు కలిగి ఉన్నత చదువులకై కళాశాలల వైపు గంతులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు.
కుల కట్టుబాట్లు ఇంకా కొనసాగిస్తున్నారనే ఆవేదనను వెల్లడిస్తున్నారు.
దొర వేసే “ఎర” (ఆహారం-సీస) కు తలొగ్గి “చావు బొంద” తవ్వేందుకు పోటీ పడుతూ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు మంచి రాచబాటలు నిర్మించుకోవాలి.
పలకపై నేర్చుకునే అక్షరాలే ధనరాశులుగా మార్చుకోవాలి.
ఇటువంటి వ్యవస్థను పునరుద్ధరణ చేయాలి.
జాతిని జాగృతం చేయడానికి చదువు ఒక్కటే మార్గం. చదువుతోనే భవిష్యత్తు మలుపు తిరుగుతుంది. చదువుతోనే సంస్కారం, విలువలు పెంపొందుతాయి.
ఇది ఆయా గ్రామాలలో యువతతోనే సాధ్యపడుతుంది.
యువత పెడదారిన పడకుండా చదువుపై పట్టు తో “పట్టభద్రులు” కావాలని బహుజన ఉద్యమకారులు, మేధావి వర్గాలు, సామాజిక విశ్లేషకులు కోరుతున్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి