
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ బీబీనగర్:-అర్హులైన రైతులు రైతు భీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు తెలిపారు.శనివారం మండలంలోని బీబీనగర్ జైనపల్లి గ్రామాలల్లో రైతుల నుండి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు.18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న రైతులు అర్హులని,బీమాకు అర్హత కలిగిన రైతులు భూమి పాస్ పుస్తకం జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్,నామిని జిరాక్స్ అందజేయాలన్నారు.