జనసముద్రంన్యూస్, జూన్ 18, పల్నాడు జిల్లా, మాచర్ల.
మాచర్ల పట్టణంలోని శ్రీనివాస్ మహల్ వెనుక వైపు ఉన్న వడ్డెర కాలనీ లో గల శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణ పూజలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం పాల్గొన్నారు . ఈసందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు , టీడీపీ నాయకులు కేశవరెడ్డి, అక్కిరెడ్డి,వజ్రం నాయక్ మరియు పలువురు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు .





