ఘోరం గా ఓడిపోయిన వైసీపీ పార్టీ కి…?? జగనన్న వదిలిన బాణమా..? ఊహించిన పరిణామమా…!!

Spread the love

ఆశలు పెట్టుకున్న ఎస్సీ, ముస్లిం సామాజిక ఓట్లకు గండి కొట్టింది ఎవరు..?

ప్రజలకు మసిపూసిన యాలక్కాయను చూపించి..?? లోపల ఉన్న గుజ్జును తినేయడమా…?

నమ్ముకున్న సలహాదారుడు ధనుంజయ రెడ్డి…?? సజ్జల రామకృష్ణారెడ్డి…?

జనసముద్రం న్యూస్ రిపోర్టర్,జూన్ 5:

అప్పుడు అన్న వదిలిన బాణం. ఇప్పుడు అన్నకే గుచ్చుకున్న బాణం.

కనిపించిన శత్రువు, కనిపించకుండా చేసిన గాయం…

వైసీపీని సలుపుతోంది. జగన్‌ ఓటమిలో చెల్లి షర్మిల పాత్ర ఎంత?

కాంగ్రెస్‌ని గెలిపించలేకపోయినా…!, వైసీపీని ఓడించడంలో షర్మిల కీలక పాత్ర పోషించారా?

ఆమె ఒకప్పుడు అన్న వదిలిన బాణం… 2014లో జగన్‌ కోసం, వైసీపీ కోసం….వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు..! షర్మిల… ఆ తర్వాత 2019లో కూడా అన్న కోసం మరోసారి కొంగు బిగించి ఎన్నికల రణరంగంలోకి దూకారు. ఆ తర్వాత జగన్‌తో షర్మిలకు గ్యాప్‌ వచ్చింది. ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజకీయ లక్ష్యాలు, గమ్యాల్లో కూడా తేడా వచ్చింది.

ఆ తర్వాత తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అనే పార్టీ పెట్టిన షర్మిల…మరోసారి పాదయాత్ర చేశారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్దిగా ముందుగానే అక్కడ దుకాణం కట్టేశారు షర్మిల… కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత ఏపీ పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన షర్మిల…ఏకంగా అన్న జగన్‌ పైనే విమర్శల బాణాలు సంధించడం మొదలుపెట్టారు. జగన్‌కు కంట్లో నలుసుగా మారారు. ఇంటి వ్యక్తి శత్రువుగా మారితే…ఆ బాధలు ఇంతింత కాదయా…. అనే లెవెల్లో జగన్‌ను ఇబ్బందులు పెట్టారు. అన్న వదిలిన బాణం…చివరకు అన్నకే గుచ్చుకుంది.

ఏపీలో కాంగ్రెస్‌కు 2 శాతం కంటే కాస్త తక్కువగా ఓట్లు వచ్చినా, చాలా చోట్ల వైసీపీని ఇబ్బంది పెట్టగలిగారు షర్మిల. మరీ ముఖ్యంగా ఎస్సీలు, ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే చోట్ల షర్మిల ఫ్యాక్టర్‌ పని చేసిందని చెబుతున్నారు. గుంటూరు ఈస్ట్‌ లాంటి చోట్ల కాంగ్రెస్‌కు మైనారిటీల ఓట్లు బాగానే పడ్డాయనే అంచనా ఉంది. ఇక రాయలసీమలో మరీ ముఖ్యంగా కడపలో పులివెందులలో షర్మిల వల్ల వైసీపీ బాగా నష్టపోయిందనేది విశ్లేషకుల అంచనా.

కాంగ్రెస్‌ని గెలిపించలేకపోయినా, వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఓ కారణం అయ్యారని నిపుణులు చెబుతున్నారు… ఇంటిని గెలిసి రచ్చ గెలసాలి అన్నారు పెద్దలు అంటున్న విశ్లేషకులు
వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య వల్ల… మీ సొంత చెల్లెలు వైఎస్ సునీత రెడ్డి పడుతున్న బాధలు…!! చెడుదారులు ఎప్పటికైనా మనకు శత్రువులు రెడ్డి… మంచి దారులు మనకి ఎప్పటికైనా ప్రాణమిత్రులు రెడ్డి… తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్