జనసముద్రంన్యూస్, జూన్ 5, పల్నాడు జిల్లా.
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న క్రమంలో కూరగాయ ధరలు మరియు నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందకుండా పోయాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు టమోటా, దోసకాయ,మునక్కాయ, బెండకాయ, వంకాయ, కాకరకాయ అక్షరాల 80 నుండి 100 రూపాయలు వ్యాపారస్తులు అమ్ముతున్నారు. ఇక నిత్యావసర వస్తువులు అయితే ఉన్న రేట్లకు మరో కొంత జోడించి మరీ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు. ఉదయం వేళలో టిఫిన్ చేద్దామన్నా, టీ తాగుదామన్నా కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో కొంత వెసులుబాటు అయినా ఇవ్వాలని, 24 గంటలు 144 సెక్షన్ అమల్లో ఉంటే ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందని కావున కొంత వెసులుబాటు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.





