జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 31 మే
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో హరితహారం పేరు తో చెట్లను నాటడం, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను నిర్వహించిన విషయం విధితమే.

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం నెలకొనడంతో హరితహారం పేరు ఇకపై ఇందిర వన ప్రభగా మార్చుతున్నట్లు సమాచారం.
వర్షాకాలం ప్రారంభం నుండే ఈ ఇందిర వనప్రభ కార్యక్రమం ఆచరణలో కానుంది.
తాజా నిర్ణయంతో మొక్కలు నాటి సంరక్షించడం, నర్సరీలను ఏర్పాటు చేయడం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు.
రహదారులకు ఇరువైపులా మొక్కలను పెంచనున్నారు.
కోతులు, ఇతర పక్షుల కోసం వుడ్ కోర్సులను ఏర్పాటు చేయనున్నారు.
ఇంటి ఆవరణలో పండ్లను ఇచ్చే మొక్కలు నాటడం, వాటిని పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
విద్యార్థులకు పచ్చదనం ప్రాధాన్యత అంశాలపై పూర్తిస్థాయిలో వివరించనున్నారు.

ప్లాంటేషన్ నమూనాలు, బోర్డులు మారనున్నాయి.
సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూములలో వనాల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
జవాబుదారితనంతో పనులు నిర్వహించాలని, పక్కాలెక్కగా ఇందిర వన ప్రభ అమలు చేయాలని ప్రభుత్వ అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.





