- ఈ దారులు ముయ్యడానికి ఆక్రమించుకున్న వాళ్ల వద్ద..?? పంచాయతీ మరియు రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు, ఎంత ముడుపులు పుచ్చుకున్నారు…?? అంటున్న స్థానికులు…!
- రాత్రికి రాత్రి మా ఇంటికి గడప వద్ద కూడా గోడలు కట్టేస్తారేమో…?? అంటూ రాత్రుల్లో మేలుకొని ఉంటున్న గాంధీనగర్ ప్రజలు…
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ మే 30 జనసముద్రం న్యూస్
అన్నమయ్య రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు పట్టణమునందు 70సం,, పైబడి ఉంటున్న దారులు గాని రోడ్లు గాని డ్రైనేజీ కాలవలు గాని భూ కబ్జాదారుల చేతులతొ ఆక్రములకు గురి కావడం..! హిందూ దేవాలయ భూములను ఆక్రమించుకోవడం..?? అంతేకాక రోడ్లును బ్లాక్ చేసి రాత్రికి రాత్రి గోడలు కట్టేయడం జరుగుతున్నది, పంచాయతీ రోడ్లకు కూడా అడ్డుగోడలు కట్టేయడం జరుగుతున్నది.
వివరాల్లోకి వెళితే:. విక్టరీ స్కూల్ పెట్టి 33 సంవత్సరాలు అయింది,ఈ 33 సంవత్సరాల నుండి ఏ సమస్య లేకుండా అందరూ నడుస్తూ వస్తున్న దారిని. రాత్రికి రాత్రి అడ్డుగోడలు కట్టేయడం.. పట్టణంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతున్నది, అంతేకాక గాంధీ నగర్ లో ఉండే వారందరికీ కూడా అదే రోడ్డున వెళ్ళవలసి ఉంటుంది, అలాగే టోల్గేట్ దగ్గర ఏదైనా ధర్నాలు జరిగినప్పుడు బైపాస్ రోడ్డు ఉపయోగించుకోవడంలో ఇది ఒకటే దారి… అందరికి ఉపయోగపడుతుంది,. ఒక అంబులెన్స్ రావాలన్నా… గాంధీ రోడ్ లో ఉండే ముసలి వాళ్లు హాస్పిటల్ కి వెళ్ళాలి అన్న ఎక్కువగా ఆ రోడ్ లోనే వెళ్తారు.. శ్రీరామ్ నగర్, రంగనాయకులపేట, ఆ రోడ్డు నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లే వారందరూ కూడా ఈ రోడ్డునే వాడుకుంటారు.అలాగే కాలేజీ పిల్లలందరూ కూడా బస్టాండ్ దిగి రంగనాయకులపేట నుండి ఈ వీధిలోకి వచ్చి ఇక్కడ నుండి వశిష్ట జూనియర్ కాలేజ్, షిరిడి సాయి జూనియర్ కాలేజ్, ఎస్వి జూనియర్ కాలేజ్ లకు, వెళుతూ ఉంటారు అటువంటి రహదారికి అడ్డుగోడ కట్టడం ఏంటి అంటూ పట్టణ ప్రజలు స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు కాలేజీ విద్యార్థులు మరియు హాస్పిటల్ కి వెళ్ళవలసిన వృద్ధులు ఆ దారినే ఉపయోగించుకుంటూ ఉంటారు అటువంటి దారిని అడ్డుగోడ కట్టుకోవడం ఏంటి అని పట్టణ ప్రజలు అధికారులను ప్రశ్నించడం జరుగుతున్నది..
అంతేకాక ఒక సమాజం అభివృద్ధి చెందింది అంటే ముఖ్యంగా చూసేది రోడ్లే అలాంటి రోడ్లను కబ్జా చేస్తే అడగడానికి పంచాయతీ వారు గానీ రెవిన్యూ వారు గానీ పోలీస్ వారు గాని ఎవరూ లేరా అని ప్రశ్నించడం జరుగుతున్నది ఈ అడ్డుగోడ కట్టడం వలన స్థానికులు పిల్లలు వృద్దులు చాలా ఇబ్బంది పడుతున్నారు వీరి మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలు మరియు స్థానికులు విద్యార్థులు కలెక్టర్ వారిని, మరియు ఆర్డిఓ వారిని, ఎమ్మార్వో వారిని, కోడూరు పంచాయతీ వారిని కోరుతున్నామని చెప్పడం జరుగుతున్నది..





