డిసిపి సమక్షంలో తప్పిపోయిన పాపను వారి బంధువులకు అప్పగించిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా మే.31,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మహమ్మద్ అజీజ్ కూతురు మహమ్మద్ ముస్కాన్ వయస్సు.3 సం.లు గురువారం రోజు రాత్రి నుంచి కనబడలేదని పాప అమ్మమ్మ బీబీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అయితే శుక్రవారం సాయంత్రం అందాజ 5 గంటల ప్రాంతంలో గురువారం తప్పిపోయిన ముస్కాన్, వయస్సు. 3 సం.లు గల పాపను బీబీనగర్ పోలీసు వారు మరియు రఫిక్ అనే వ్యక్తి కలిసి పాప గురించి వెతుకుతూ బీబీనగర్ పోయి వస్తుండగా ఉయ్యాల కుంటకు పోయే దారిలో రోడ్డు పక్కన బర్ల కొట్టం దగ్గర పని చేయు వారి వద్ద ఎవరో తప్పిపోయి వచ్చిన పాప ఉంది అని చెప్పగా అతను చూసి పాపను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకురాగ డిసిపి యదాద్రి-భువనగిరి సమక్షంలో పోలీస్ వారు సదరు పాపను వారి బందువులకు అప్పజెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏసీపీ రవి కిరణ్ రెడ్డి,సిఐ ప్రభాకర్ రెడ్డి,ఎస్సై రమేష్ పోలీస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.





