జనసముద్రం న్యూస్ పామర్రు ప్రతినిధి సుబ్రహ్మణ్యం. మే.31.
మండల పరిధిలో జరుగుతున్న అక్రమమట్టి రవాణా ను అడ్డుకున్న రెవెన్యూ శాఖ అధికారులు.. వివరాలు మేరకు పామర్రు మండల పరిధిలోని జిజ్జవరం పరిధిలో అర్ధరాత్రి సమయంలో యదేచ్చకంగా అక్రమంగా జరుగుతున్న మట్టి రవాణాకు సంబంధించిన మూడు ట్రాక్టర్లను తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న దృష్ట్యా ఈ అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపినట్లు విశ్వాసనీయ సమాచారం.
అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్ ఒక్క దా నికి కిశుక్రవారం 5000 అపరాధ రుసుము విధించినట్లు తెలిసింది.





