సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండల్ జనసముద్రం ప్రతినిధి :- కథనం జూన్ 05.
ఝరసంగం మండలం పరిధిలో కప్పాడ్ గ్రామంలో పొలాల మధ్యలో ఏర్పాటు చేసిన త్రీ ఫేస్ విద్యుత్ స్తంభం వంగిపోయింది, మరో మూడు స్తంభాలు కూడా వంగి ప్రమాదాన్ని తలపిస్తున్నాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్తంభాలు ఎప్పుడూ కూలుతాయో తెలియని పరిస్థితి ఉంది రైతులకు అందే విధంగా వైరు వేలాడుతున్నాయి, ఈ విషయంపై సంబంధిత విద్యుత్ ఏఈకి సంవత్సరం నుంచి విన్నవించుకుంటున్న పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు, సంబంధిత అధికారులు స్పందించి స్తంభాలను సరిచేయాలని రైతులు హపోతున్నారు.





