వాహనాలను తనిఖీ చేసిన హుజురాబాద్ ఏసిపి.

Spread the love

మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు, భారీ జరిమానాలు విధిస్తాము.

జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 9 జూలై

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన
జమ్మికుంట లో మంగళవారం రోజున జమ్మికుంట పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, మైనర్లు నడిపిన వానలతో పాటు త్రిబుల్ రైడ్ చేసిన వాహనదారులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
53 ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీల్లో పట్టుకుని స్టేషన్ కు తరలించగా హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి వానదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జి వాహన దారులతో మాట్లాడుతూ ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ కనబడే విధంగా ఉండాలని, నెంబర్ ప్లేట్ల పైన అనవసరమైన రాతలు రాయవద్దని సూచించారు.
దానితోపాటు మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని,
భారీగా జరిమానాలు కూడా విధించబడతాయని తెలిపారు. ఒక్కొక్క ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారని ఇది చట్ట వ్యతిరేకమని ఇకపై ఎవరైనా వాహనానికి సంబంధించిన పేపర్లు లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా త్రిబుల్ రైడ్ చేసిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా వాహన దారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.
ఏ విషయంలోనైనా పోలీసులు మీకు సహకరిస్తారని పోలీసులకు మీరు కూడా సహకరించాలని చట్టబద్ధంగా ఏ పనైనా పోలీసులు చేస్తారని చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సి వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, ఎస్సై రాజేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి