జనసముద్రం జమ్మికుంట టౌన్ న్యూస్ ప్రతినిధి: 5 జూన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ:2000 కోట్ల రుణం భారతీయ రిజర్వు బ్యాంకులో నుండి తీసుకుంది.
మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.
ఈ రుణానికి 16 ఏళ్ల కాల పరిమితి, 7.44 శాతం వార్షిక వడ్డీతో రూ:1000 కోట్లు,
19 ఏళ్ల కాలపరిమితి,7.43 శాతం వార్షిక వడ్డీతో రూ:1000 కోట్ల రుణాన్ని తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంతో కలిసి దేశంలోని 11 రాష్ట్రాలు
రూ:19,500 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.





