బంగ్రంపల్లి గ్రామాంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో మృతి
గ్రామపంచాయతీ ట్రాక్టర్లో చంద్రయ్య మృతదేహాం ఇంటికి తరలింపు..
చౌడాపూర్ మండల ప్రతినిధి మే 30/జనసముద్రం న్యూస్ :
హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి.. ఉపాధి పనికి వెళ్లి వస్తున్నా కూలీ మృతి చెందాడు.ఈ ఘటన చౌడాపూర్ మండల పరిధిలోనీ బంగ్రంపల్లి గ్రామాంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..బంగ్రంపల్లి గ్రామపంచాయతీకి చెందిన బి.చంద్రయ్య తండ్రి భీమయ్య వయస్సు 58 సంవత్సరాలు బంగ్రంపల్లి,అగ్రహారం గ్రామాల చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లాడు.ఎప్పటిలాగే కూలీలతో కలిసి మట్టి తీసి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో,అక్కడే కుప్పకూలీ మృతి చెందాడు.చంద్రయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఉపాధి హామీ పని దగ్గరలో ఉన్నా స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి రేణుక ఇట్టి మరణ వార్త తెలుసుకొని గ్రామపంచాయతీ ట్రాక్టర్లో చంద్రయ్య మృతదేహాన్ని ఇంటికి చేర్చడం జరిగింది.





