ఆభరణాలతో వస్తే ఆరుబయటే.

Spread the love

గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టి.యస్.పి.యస్.సి. కీలక సూచనలు.

జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 30 మే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లోని 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.యస్.పి.యస్.సి) ఏర్పాటు చేస్తోంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 1వ తేదీ నుండి హాల్ టికెట్లు జారీ చేయనుంది.
అభ్యర్థులు కమిషన్ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.


జూన్ 9వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు పరీక్ష నిర్వహించనుంది.
పరీక్ష సమయానికి గంటన్నర ముందే అభ్యర్థుల్ని హాల్లోకి అనుమతిస్తారు.
ముఖ్యంగా మహిళలు ఆభరణాలు (నగలు- చైన్స్) వాచ్ ధరించవద్దని కీలక సూచనలు చేశారు.
చేతి వేళ్లకు గల ఉంగరాలను ధరించకుండా ఉండాలి.
చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు వేసుకొని రాకూడదు.
సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్, పెన్ డ్రైవ్, బ్లూ టూత్, లాగ్ బుక్స్, ట్యాబ్లెట్స్, హ్యాండ్ బ్యాగ్, రైటింగ్ ప్యాడ్స్, ఎలక్ట్రానిక్ గ్యారెట్లు ముఖ్య కేంద్రంలోకి అనుమతించబడమని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ వివరాలు ఇవ్వని అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు మూల్యాంకం చేయమని కమిషన్ స్పష్టం చేసింది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చివరి మూమెంట్లో ఇబ్బందులు పడకుండా ఒక రోజు ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లి సరిచూసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు ముద్రించిన ఓఎంఆర్ షీట్ ను పరిశీలన చేసుకొని ఓఎంఆర్ షీట్ లో పొందుపరిచిన నిబంధనలు కచ్చితంగా పాటించేలా అభ్యర్థులు సహకరించాలని టి.యస్.పి.యస్.సి. ఒక ప్రకటనలో పేర్కొంది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి