స్టేడియం లోపల ఒక ప్రక్క మందు బాటిళ్ళు… మరొక ప్రక్క రాళ్లు.
గ్రౌండ్లో ఇబ్బందులు…. పడుతున్నామని మార్నింగ్ వాకర్స్ ,క్రీడాకారుల ఆవేదన…
అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు..
తుంగతుర్తి ప్రతినిధి మే 30 జనసముద్రం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని క్రీడాకారుల మినీ స్టేడియంలో ఒక ఒక పక్క మందు ప్రియుల మద్యం బాటిళ్లు మరొక పక్క ఈ మధ్యకాలంలోనే రైతులకు కొనుగోలు కేంద్రంగా మార్చి ధాన్యం అమ్మకాలు సాగించి, సమయంలో రైతులు అక్కడనే రాళ్లు పడి వేయడం, సదరు కొనుగోలు యజమాని నిర్లక్ష్యంతో ఉదయం పూట గ్రౌండ్లో వాకింగ్ చేయడానికి వచ్చిన ప్రజలకు మరొక ప్రక్క క్రీడాకారులు ఆడుకోవడానికి రాళ్లు ఉండడంతో ఇబ్బందిగా మారుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మినీ స్టేడియం నేషనల్ హైవే కి దగ్గరగా ఉండటంతో రోడ్డుపై వెంట వెళ్లే వాహనదారులు, మరొక పక్క మండలంలో ఉన్న జులాయి గుంపు నియమ నిబంధన అతిక్రమించి రాత్రి వేళలో స్టేడియం లోకి వెళ్లి మద్యం సేవించి పైగా అక్కడే బాటిల్స్ వేయడం, కొంతమంది మత్తులో పగలగొట్టడం జరుగుతుంది. కావున మండల సంబంధిత అధికారులు, పోలీస్ అధికారులు తక్షణమే జరుగుతున్న సంఘటన పట్ల రాత్రివేళ నిఘా పెంచి, విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని వాకర్స్, క్రీడాకారులు, మేధావులు కోరుతున్నారు





