యాదాద్రి భువనగిరి జిల్లా మే.30,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ భువనగిరి పట్టణం హుస్సేనాబాద్ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీ వద్ద విద్యుత్ వైర్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం ఇందిరమ్మ కాలనీ వద్ద కొత్త విద్యుత్ లైన్లు వేయగా ఉన్న వైర్లను దొంగలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్ప చెప్పారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.





