జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా మే 29
జంగారెడ్డిగూడెం పట్టణం లోని పేరంపేట రోడ్డు లో విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు బాగోతం గత రాత్రి బట్టబయలు అయ్యింది. కరెంటు పోయిందని సబ్ స్టేషన్ కి స్థానికులు వెళ్లగా విధుల్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ మద్యం సేవించి మహిళతో నగ్నంగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.నిన్న ఉదయం నుంచి జంగారెడ్డిగూడెం 9,10 వార్డులలో తెల్లవారుజామున 3:30 కరెంట్ పోవడంతో ఎంతసేపటికి కరెంట్ రాకపోవడంతో స్థానికులు సబ్ స్టేషన్ వద్దకు వెళ్లడంతో సబ్ స్టేషన్ లోపల డ్యూటీలో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి వేరొక మహిళతో నగ్నంగా వివస్త్రలుగా మంచం మీద ఉండటంతో ఆశ్చర్యానికి గురయిన ఏమి చెయ్యాలో తెలియక స్థానిక ప్రజలు ఎలక్ట్రికల్ ఏ. డి కి ఫోన్ చేసి సమాచారం ఎవ్వటంతోసంఘటన స్థలానికి వెళ్లిన ఎ. డి మరియు అధికారులు.వెంటనే గంగు మహేష్ రెడ్డిని సస్పెండ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.





