నీవు ఆరు సంవత్సరాలు ఆమెతో సంసారం చేశావు…?? నీవు ఇచ్చిన 20 లక్షలు సరిపోయింది పో… అంటున్నాడు ఆగ్రామానికి పెద్దమనిషి , రాజకీయ నాయకుడు….!!
ఇటువంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లే అటువంటి దొంగలు తయారవుతున్నారు…, వీరు గ్రామంలో పెద్ద మనుషుల..? లేక ఆ దొంగ స్వాములకు కమీషన్ బ్రోకర్ల…??
అమ్మవారి విగ్రహం పక్కనే..! నాతో సహజీవనం చేసిన…! వీడియోలు మీరే చూడండి..! అని చూపిస్తున్న బాధ్యుడు..!
ఆ వీడియోలు చూసి, కంగుదిన్న విలేకరులు..??
అన్ని ప్రూఫ్లతో…! పెన్ డ్రైవ్ తో..! రిపోర్టర్లకు ఇచ్చిన బాధ్యుడు..!! మీరే నాకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరై ఏడుస్తున్న బాధ్యుడు…!!
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ మే 29 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మేజర్ పంచాయితీ అయినటువంటి అనంతరాజుపేట గ్రామ పరిధిలో కట్ల అమరమ్మ అలియాస్ కావమ్మ అని చెప్పబడిన బూటకపు కామాంధు పిశాచి..!!
వివరాల్లోకి వెళితే:-
వేరే మతానికి సంబంధించిన జాకీర్ అని నేను, ముక్కట్ల అమరమ్మ అలియాస్ కావమ్మ అనే మహిళ హిందూ సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించుకునే కావమ్మ తల్లి అవతారమని చెప్పుకొని, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల నాకు వేరే వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తే వెళ్లిన నన్ను, నీకు పెద్ద దోషముందని వెంటనే నీకు శక్తి స్వరూపమైన దుర్గమ్మకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి, బంగారంతో తయారు చేసిన తాళి, మరియు బంగారం నగలు తెప్పించి, దుర్గమ్మ విగ్రహానికి నాకు పెళ్లి చేసి, నేటి నుండి నువ్వు కూడా దేవుడు అని చెప్పి ,ఇప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి అయింది కాబట్టి సంసారానికి ఒక శరీరం కావాలి…!! కాబట్టి కావమ్మ నాలో ఆవహిస్తుంది. కావున వెంటనే ఇంకో తాళి తీసుకొని వచ్చి చీరాసారతో మరియు నగలతో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పిందని, ఆల్రెడీ పెళ్లయిన తను… తన భర్త బిడ్డలు కోడళ్ళు సమక్షంలో నాతో తాళి కట్టించుకుని వారి ముందర సంసారం చేసింది…. ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత నా ఆరోగ్యం మెరుగు అవ్వకపోవడం వల్ల నేను ఆమెను నిలదీస్తూ వచ్చాను…. అంతేకాక నాలాగే నలుగురు బాధితులు పెళ్లి చేసుకున్న వారు వచ్చి, నా ముందే నిలదీయడం జరిగింది….! అది చూసిన నేను ఇంత పెద్ద మోసం ఎలా చేస్తున్నావ్ అని అడగ్గా, ఆమె, ఆమె కొడుకులు, ఆమె భర్త, ప్రజల కానుకలతో ప్రభుత్వ కళ్ళు కప్పి నిర్వహిస్తున్న బీడీ కాలేజ్ లోకి నన్ను తీసుకెళ్లి, కొట్టి నా బట్టలు విప్పి నా అంగాన్ని కొయ్య పోయారు. వారం రోజులు నన్ను తీవ్రంగా కొట్టి హింసించి చంపబోయారు. వారి కాళ్ళ మీద పడి నేను ఈ విషయం బయటికి చెప్పను..!! అని బతిమాలి అడుక్కున్నాను..!! ఈ బీఈడీ కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు బయటికి చెప్పకూడదని.. నాతో ప్రమాణం చేయించుకున్నారు, బీఈడీ కాలేజీలో కావమ్మ కొడుకులు విద్యార్థినిలతో చేస్తున్న అసభ్యకర పనులు చాలా ఉన్నాయి, మరియు ఆమె భర్త విద్యార్థినులతో చాలాసార్లు అసభ్యకరంగా ఉండడం నేను చూశాను, ఈ విషయాలన్నీ నేను చెప్పను అని వాళ్ళ కాళ్ళ మీద పడి రాగే పడితే నన్ను వదిలిపెట్టారు..? అక్కడనుండి ప్రాణాలు దక్కించుకొని ఊరి పంచాయతీ ప్రజల దగ్గరికి వెళ్ళగా వారు నా దగ్గర ఆధారాలు తీసుకొని స్టేషన్కు తీసుకెళ్లి ఎస్ఐ గారితో మాట్లాడుకుని ఆయనకు డబ్బులు ఇచ్చి ఎటువంటి కేసు పెట్టకుండా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో మూడు రోజులు నాకు తిండి ,నీళ్లు, పెట్టకుండా లాకప్ లో పెట్టి కొట్టడం జరిగింది.. న్యాయం చేయాల్సిన ఎస్సై మరియు పంచాయతీ పెద్దలు ఈ విషయం బయటికి చెబితే నీ మీద కావమ్మ కోడళ్లను కూతుళ్లను రేప్ చేశావని దొంగ కేసు పెడతామని బెదిరించారు… దీంతో భయపడి పోయిన నేను ఏం చేయాలో తోచక, ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి పెళ్లి కాకుండా పోయిన నాకు ఎవరు చూసుకోలేక అనాధగా మిగిలిపోయాను, ఇక ఆత్మహత్య చేసుకోబోతుండగా రైల్వే కోడూరు పాత్రికేయులుకు నేను చెప్పుకున్నాను వారు నన్ను ధైర్యంగా ఉండమని చెప్పారు, హిందూ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే అక్కదేవతలు, కాళికా తల్లి, మరియు వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి, వారి పేర్లు ఎత్తుతూ ఎంత పవిత్రమైన కావమ్మకు, నాకు పెళ్లి చేసి, ఆమెతోను సంసారం చేస్తున్నామని ఆరేళ్లు ఆ తల్లిని కించపరిచిన ఇలాంటి రాక్షస మనుషులను ఈ సమాజంలో అన్హారులుగా ప్రకటించాలని..
మరి నాలాంటి బాధితులు తయారు కాకూడదని.. నష్టపోయిన బాధితులను గుర్తించి వారికి తగిన న్యాయం చేసి, ఇలాంటి కామ రాక్షసులు ఉండ కుండా చూడాలని మరియు ఇలాంటి రాక్షసులను డబ్బుల కోసం దేవతల పేర్లు చెప్పుకొని చేసే దుర్మార్గుప్ప పనులను కొంతమంది చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఉండడం వలన మరియు ప్రశ్నించకుండా ఉండడం వలన ఎంతోమందికి ద్రోహం చేస్తూ పోతున్న వీళ్ళ కుటుంబము…! ప్రజలు మూఢనమ్మకాలు నమ్మకుండా, అప్రమత్తంగా ఉండాలని నేను ధైర్యంగా చేస్తున్న పోరాటమిది… నా దగ్గర అన్ని సాక్షాధారాలు ఉన్నాయి, హిందూ మనోభావాలను భంగం కలిగించే ఇలాంటి చర్యలను పోలీసులు ఎలా ఉపేక్షించారు..??నేను అన్ని ఆధారాలు చూపించినప్పటికీ వారికి శిక్ష వేయకుండా… ఈ సంవత్సరం కూడా జాతర జరిపిస్తుంది.. ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి అమాయక ప్రజలు ..
అన్ని ఆధారాలు చూపించి వీళ్లు డేరా బాబా కన్నా పెద్ద దొంగలు అన్ని సాక్షాదారాలతో చూపించిన పట్టించుకోని పోలీసు యంత్రాంగం… అంటే ఇది పోలీసుల లోపం కాదా…!! అని మీడియా సోదరులు ఎదురుగా నేను ప్రశ్నిస్తున్నాను.. హిందూ దేవీ దేవతల మీద నాకున్న అపార నమ్మకము మరియు భక్తి వల్ల ఈ జాతర జరగకుండా ప్రజలను కాపాడాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను…. అని ఉద్వేగముతో మీడియా ముందు వాపోయిన బాధితుడు జాకీర్…!





