వాలంటీర్ ఇంట్లో దొరికిన నాటు బాంబులు

Spread the love

జనసముద్రంన్యూస్, మే29, పల్నాడు జిల్లా , బెల్లంకొండ మండలం.

ఎన్నికల పోలింగ్ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్ అయిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకుని.. నాటు బాంబులను దాచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలోకి వెళ్తే ….పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం లోని నాగిరెడ్డిపాలెంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఏకంగా ఓ ప్రభుత్వ వాలంటీర్ ఇంట్లోనే ఈ బాంబులు కనిపించాయి. ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని.. పోలీసుల అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు పోలీసులు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అణువణువూ గాలిస్తున్నారు.ఈ క్రమంలోనే బుధవారం నాడు నాగిరెడ్డిపాలెంలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ వాలంటీర్ ఇంట్లో నాటు బాంబులు కనిపించాయి. వెంటనే వాటిని సీజ్ చేశారు పోలీసులు. వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వాలంటీర్ తండ్రి వైసీపీకి చెందిన నాయకుడు కావడం మరో విశేషం. దీంతో వాలంటీర్‌ను, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.కొద్ది రోజులకు ముందు కూడా పలువురు వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు దొరికాయి. జిల్లాలోని గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు లభించాయి. ఎన్నికల వేళ జరిగిన గొడవల నేపథ్యంలో పోలీసులు పిన్నెల్లిలో తనిఖీలు చేపట్టగా.. ఈ బాంబులు లభించాయి. ఇప్పుడు నాగిరెడ్డిపాలెంలో నాటు బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు సృష్టిస్తారోనని ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్