జనసముద్రంన్యూస్,మే22, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల.
మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణ లోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసిన ఎమ్మెల్యే పిన్నెల్లి తన కారు వదిలి పరారైనట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారని సమాచారం. కాగా పిన్నెల్లి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఇఒ ని , డీజీపీ ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.





