దేవరకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన సయ్యద్ అజ్మతుల్లా ( పాషా భాయ్)
గతం 30 సంవత్సరాలగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహితి అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి సేవరత్న జాతీయ అవార్డు 2024 గాను ఎంపిక చేశారు. బహుజన సాహితి అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ మరియు బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు అహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోనే బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేల నిర్వహించే బహుజన రైటర్స్ నాలుగవ సమావేశం సందర్భంగా సేవ రత్న నేషనల్ అవార్డును అందజేయ నున్నట్టు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. ఈ అవార్డు సెలెక్ట్ చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మరియు బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకుగాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని సయ్యద్ అజ్మ తుల్ల తెలిపారు.





