జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 30
సత్రంపాడు సాయిబాబా గుడివద్ద ఏలూరు లోని ఒక్క ప్రయివేట్ స్కూల్ లో పనిచేస్తున్న రత్నగ్రెసి అనే యువతిని ముసునూరు గ్రామానికి చెందిన ఏసురత్నం అనే యువకుడు కత్తితో నరికి చంపాడు.వివరాల ప్రకారం గత కొంతకాలంగా ఏసురత్నం అనే యువకుడు రత్నగ్రెసి వెనక ప్రేమిస్తున్నానంటూ,పెళ్లి చేసుకోవాలి అని వత్తిడి తీసుకు వచ్చేవాడు,అదే క్రమంలో యువతి ఇంటికి వెళ్లి కుటుంభ సభ్యులకు కూడా మీ అమ్మాయిని పెళ్లి చేసుకొంటాను అనగా వారు నిరాకరించారు.అంతే కాకుండా గతనెలలో రత్నగ్రెసి కి నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రేమించిన మనిషి దక్కదు అనే అక్కసుతో ఏసురత్నం రత్నగ్రెసి ని మాట్లాడాలి రమ్మని పిలువగా వెంట వెళ్ళింది.ఇదే అదనుగా భావించిన ఏసురత్నం తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేసి విచక్షణ రహితంగా నరకటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.వెంటనే ఏసురత్నం ఆదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేసాడు.స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఏలూరు 3వ పట్టణ పోలీసులు యువతి మృతదేహాన్ని ప్రభత్వ ఆసుపత్రిలో ని మార్చురీకి తరలించి గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఏసురత్నం ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరిన్ని వివరాలు తేలియాల్సి ఉంది





