యాదాద్రి భువనగిరి జిల్లా మే.29, భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం ముగ్ధుంపల్లి గ్రామానికి చెందిన రైతు ఏంజాల సత్యనారాయణ రెండు నెలలు అవుతున్న వడ్లు కొనుగోలు చేయకపోవడంతో మనస్థాపానికి గురై రైతు ఇబ్బంది పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దే తలగబెట్టడం జరిగింది.ఈ సంఘటనా స్థలాన్ని ముగ్దుంపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ శెట్టి నరేష్ తదితరులు పరిశీలించి మాట్లాడుతూ రైతు ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యం ఈదురుగాలతో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు కొందరైతే,కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన తర్వాత అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తి రైతులు నష్టపోతున్న,ఆరా కోరాగా ధాన్యం కొనుగోలు చేపట్టి,పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టలేక,పూర్తిస్థాయిలో రైస్ మిల్లులకు తరలించలేకపోతున్నారు.ఈ ప్రభుత్వం వడ్లను త్వరగా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.





