జనసముద్రం న్యూస్, మే 22, (పాపన్నపేట )
పాపన్నపేట మండలంలోని రోడ్లు భవనాల శాఖ రహదారిలో పలు చోట్ల మలుపులు ఉన్నాయి. ఎక్కడా వాటి వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో తరచూ రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగి వాహన చోదకులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇటీవల ప్రమాదాల జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏమరపాటు వహిస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.





