రైతుల పాలిట శాపంగా మారిన విద్యుత్ తీగలు? పట్టించుకోని అధికార యంత్రాంగం? పంట పొలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు?

Spread the love

జన సముద్రం న్యూస్, మే 17:

(పాపన్నపేట)

మండలపరిధిలోనిపలుగ్రామాల్లో పలు పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా పొంచిఉన్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో పలు పంట పొలాల్లో గత కొన్ని రోజులుగా హై టెన్షన్ విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. పలుమార్లు విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

పట్టణంలోని ఇనుప స్తంభాలను గుర్తించామని, అక్కడక్కడ శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తీసివేసి నూతన విద్యుత్ స్తంభాలను సైతం వేస్తున్నట్లు తెలిపారు. పాపన్నపేట మండలపరిది లోని గ్రామాలలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలనిపాపన్నపేట ఏఈ సూచించారు. ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే విద్యుత్అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గుర్తించిన ప్రదేశాల్లో నూతన విద్యుత్ స్తంభాలు అమర్చినట్లు పేర్కొన్నారు. పంట పొలాల్లో తీగల గురించి రైతులు ఆందోళన చెందవద్దని త్వరితగతిన పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయిస్తామని, పూర్తిగా శిథిలావస్థకు స్తంభాలు చేరుకుంటే నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామనితెలపారు
వర్షాకాలం నేపథ్యంలో ఇనుప స్తంభాలు తాక వద్దని విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న… విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే తాము ఉన్నట్లు ఏఈ వెల్లడించారు. ఇప్పటికే పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో
లూజ్ లైన్స్ సరి చేసి, నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి