ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు?

Spread the love

మెదక్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో అని?
జన సముద్రంన్యూస్, మే 16,
(పాపన్నపేట )

లోక్‌సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్‌లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్‌ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే కేంద్రీకృతమైంది.  ఓటింగ్‌ సరళిని బట్టి తక్కువ మెజారిటీతోనే గెలుపోటములు ఉంటాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో బెట్టింగ్‌ రాజాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీలైన భాజపా, భారాస పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.లక్షల్లో బెట్టింగులు పెట్టినట్లు చెప్పుకొంటున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే మెదక్‌ పార్లమెంటు పరిధికి చెందిన కొందరు వ్యవసాయ క్షేత్రాల వద్ద వేడుకలు నిర్వహించుకుంటూ ఈ బెట్టింగ్‌ వ్యవహారంలో గుట్టుగా చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని కొందరు, మరో ప్రధాన పార్టీయే గెలుస్తుందని మరికొందరు బెట్టింగ్‌లోకి దిగిపోయినట్లు తెలిసింది. పలువురు నగదు, చెక్కుల రూపంలో బెట్టింగ్‌ కాసినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బెట్టింగ్‌ సాగించి నగదు చేజిక్కించుకున్న కొందరు  ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగి బెట్టింగ్‌ వ్యవహారానికి పాల్పడుతున్నట్లు సమాచారం. భారాస అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నేతలు హోరాహోరీ ప్రచారం నిర్వహించి విజయంపై ధీమాతో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పెద్దలు తీరిక లేకుండా ప్రచారాన్ని హోరెత్తించారు. వ్యూహ ప్రతి వ్యూహాలో సాగిన ప్రచారం తరువాత ఓటింగ్‌ ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు బూతుల వారీగా పోలైన ఓట్లు, పట్టున్న గ్రామాల తీరును పరిశీలిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఖర్చు ఏరులై పారింది. ఇప్పుడు బెట్టింగ్‌లోనూ రూ.లక్షల్లో చేతులు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా మెదక్‌ పార్లమెంటు స్థానం విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి

(వారేవేణుగోపాల్.)జర్నలిస్ట్

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్