జన సముద్రం న్యూస్, మే 16,
(పాపన్నపేట)
పాపన్నపేట మండల కేంద్రమైన పలు గ్రామాలలో గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది ఉదయం నుండి వాతావరణం చల్లబడి ఆకాశంలో మార్పులు ఏర్పడ్డాయి ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది దీంతో కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోవడంతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు






